నువ్వు తప్ప?
నీ తలపులు నా మదికి సంకెళ్ళు వేశాయి, నీ మాటలు నా గోంతుకి తాళాలు వేశాయి , నీ నవ్వులు నా మనసుకి బంధాలు వేశాయి, నీ చూపులు నా కళ్ళకి కళ్ళేలు వేశాయి , నీ జ్ఞాపకాలు నా జీవితానికి ఆనకట్టలు వేశాయి. నీ మనసనే బంధీఖానాలొ నన్ను బంధించివేశావు, నన్ను నన్నుగా వుండనీయకుండా బంధించి వేశావు ఇదేనా ప్రేమ బంధమంటే? ఇన్నాళ్ళు నాలో ఇ ప్రేమభావన ఏమయింది? నన్ను నేనే మర్చిపొయాను,నిన్ను నాలొ కలుపుకున్నాను. ఇంక నాకంటూ ఏముంది నా మనసులో నువ్వు తప్ప ...........
No comments:
Post a Comment