Recent Posts

Wednesday, January 18, 2012

సార్... మీ గుట్టు మాకు తెలుసు

ఇప్పుడు అందరి జీవితాలు ఇంటర్నెట్ తో ముడిపడి పోయాయి. సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమాని, మనిషి జీవితానికి మరుగు (ప్రైవసీ) లేకుండా పోయింది. పప్పు, ఉప్పు కొనడానికి పచారీ కొట్టు (సూపర్‌మార్కెట్) కు వెళ్లినా, అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంక్‌కు వెళ్లినా, వైద్యానికి ఆసుపత్రికి వెళ్లినా ఓ పొడవైన ఫాం ఇచ్చి ముందు దాన్ని నింపమని అడుగుతున్నారు. ఇలా ఫాం నింపి ఇచ్చామంటే మన బతుకును మనం చేజేతులారా బజారు పాల్జేసుకున్నామని తర్వాత వాపోవాల్సి వస్తుంది. కొత్తగా వస్తున్న ‘ఆధార్’ కార్డు మన పర్సనల్ లైఫ్‌ను మరింత బహిరంగం జేసే ప్రమాదం ఉన్నట్టు తెలియజెప్పే వ్యంగ్య రచనలు ఇంటర్‌నెట్‌లో చెలామణీ అవుతున్నాయి. వాటికి తెలుగురూపం ఇది.

పిజ్జా ఆర్డర్ చేయడానికి ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి పిజ్జా కార్నర్‌కు ఫోన్ చేసినప్పుడు అతనికీ, పిజ్జాకార్నర్ ఉద్యోగికీ మధ్య (ఊహాజనిత) సంభాషణ తీరు ఈవిధంగా ఉంటుంది. 

పిజ్జాకార్నర్: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నేను ఏ విధంగా సహాయపడగలను?
కస్టమర్: హల్లో... నేను పిజ్జా ఆర్డర్ చేయాలనుకుంటున్నా...

పిజ్జా: సర్ ! మీ ఆధార్ నంబర్ చెబుతారా?
కస్ట: ఆ... ఒక్క నిముషం... 889861356102

పిజ్జా: ఓ కె... మీరు... అప్పారావు గారే కదా! 17, జల వాయునగర్, ......, హైదరాబాద్ - పిన్: 5లక్షల..., మీ ఇంటి ఫోన్ నంబర్ 040 2్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ, మీ ఆఫీస్ నంబర్ 250్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ, మీ మొబైల్ నంబర్ 98్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ కదా! మీరిప్పుడు ఏ నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారు?
కస్ట: ఇంట్లో ఉన్న మరో నంబర్ నుంచి... అవును... నా నంబర్లన్నీ నీకెలా తెలుసు? 

పిజ్జా: నేనిప్పుడు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యాను.
కస్ట: నేను సీ ఫుడ్ పిజ్జా ఆర్డర్ చేయవచ్చా?

పిజ్జా: అది మీకు సరిపడదు సార్.
కస్ట: అదెలాగా?!?

పిజ్జా: మీ మెడికల్ రికార్డుల ప్రకారం, మీకు హైబ్లడ్ ప్రెజర్, హైకొలెస్ట్రాల్ ఉంది.
కస్ట: అయితే, నేను ఏం తీసుకుంటే బాగుంటుంది?

పిజ్జా: మా లోఫాట్ పిజ్జాను తినిచూడండి, మీకు బాగా నప్పుతుంది.
కస్ట: అది మీకెలా తెలుసు?

పిజ్జా: మీరు గతవారం ధన్వంతరి కార్పొరేట్ హాస్పిటల్ లో మెడికల్ టెస్ట్‌లు చేయించుకున్నప్పుడు డాక్టర్ మీకు లో ఫాట్ ఫుడ్ ప్రిస్క్రయిబ్ చేశారు సర్. 
కస్ట: ఇప్పుడు ఆ సంగతి వదిలేయ్! నాకు మూడు ఫ్యామిలీ సైజ్ లోఫాట్ పిజ్జాలు ఇవ్వు. వాటి ఖరీదెంత?

పిజ్జా: మీ కుటుంబంలోని 5 గురికి అవి సరిపోతాయి సర్ ! మొత్తం ఖరీదు: 500రూ.
కస్ట: నేను క్రెడిట్ కార్డుతో పే చేయవచ్చా?

పిజ్జా: లేదు సర్! మీరు క్యాషే పే చేయాలి. మీరిప్పటికే పరిమితిని మించి క్రెడిట్ కార్డును వాడారు. గత అక్టోబర్‌నుంచి మీరు మీ బ్యాంక్‌కు రూ.23,000.75 బాకీ ఉన్నారు. అదీ హౌసింగ్ లోన్‌ఇన్‌స్టాల్‌మెంట్ కాకుండా.
కస్ట: మీ బోయ్ పిజ్జా తెచ్చేలోగా మా ఇంటికి దగ్గర్లోని ఏటీఎం కెళ్లి క్యాష్ తెచ్చుకోవాల్సిందే నంటావు.

పిజ్జా: అలా కూడా మీరు చేయలేరు. మీరు ఇవ్వాల్టి పరిమితి వరకు నగదును విత్‌డ్రా చేసినట్టు రికార్డులు తెలుపుతున్నాయి సర్!
కస్ట: పర్వాలేదు. నీవు పిజ్జాలు పంపు. నేను క్యాష్ సిద్ధం చేసి ఉంచుతాను. ఎంతసేపట్లో పంపుతావు?

పిజ్జా: 45 నిమిషాలు పడుతుంది సర్. అప్పటిదాకా వేచి ఉండలేకపోతే మీ నానో కారులో వచ్చి వాటిని తీసుకువెళ్లండి సర్. 
కస్ట: ఏమిటీ?

పిజ్జా: మా నెట్‌వర్క్ సిస్టమ్‌లో ఉన్న వివరాల ప్రకారం మీకు నానో కారు ఉంది. దాని నెంబర్ ఏపీ09క్యుఎక్స్1108
కస్ట: ‘‘?’’ ‘‘?’’ ‘‘?’’

పిజ్జా: ఇంకేమైనా కావాలా సార్?
కస్ట: నథింగ్‌బాబా! మరో విషయం... మీ యాడ్‌లో ఉన్నట్టు పిజ్జాతో పాటూ ఫ్రీగా ఆ మూడు బాటిల్స్ కోలా కూడా పంపుతావు గదా!

పిజ్జా: మామూలుగా అయితే పంపుతాం కానీ సర్, రికార్డుల ప్రకారం మీరు డయాబెటిక్ పేషంట్. అందుకని...
కస్ట: నీ.............

పిజ్జా: జాగ్రత్తగా మాట్లాడండి సర్. గత జులై 15న సిగ్నల్ జంప్ అయినప్పుడు పట్టుకున్న ఒక ట్రాఫిక్ పోలీసును తిట్టినందుకు మీకు జరిమానా పడింది కదూ...!
కస్టమర్: 
(మూర్ఛతో అడ్డం పడి, స్పృహ తప్పిపోయాడు)